మహిళా మేయర్ దారుణ హత్య

మహిళా మేయర్ దారుణ హత్య
మెక్సికో: మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ద గంటల్లోనే ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన మెక్సికో నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెమిక్సోలో చోటుచేసుకుంది. 33 ఏళ్ల గిసెలా మోటో మెక్సికో మేయర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గిసెలా మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల సరఫరాతో పాటూ నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరగాయి. వీటితో సంబంధం ఉన్న  నేరస్తుల ఆటకట్టిస్తానని హామీ ఇచ్చారు.

ప్రమాణ స్వీకారం జరిగిన 24 గంటల్లోపే (శనివారం) కొందరు దుండగులు గిసెలా ఆఫీసులోకి  అకస్మాత్తుగా చొరబడి గన్ లతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో గిసెలా మోటో అక్కడికక్కడే మృతి చెందారు. అప్రమత్తమైన పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరిని మట్టుపెట్టి, మరో వ్యక్తిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా, కిడ్నాప్, హత్యలులాంటి క్రైంలు మెక్సికోలోని మోరెలాస్ లొ గత కొన్నేళ్లుగా ఎక్కువగా నమోదవుతున్నాయి.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment