ఐస్‌క్రీమ్ అమ్ముతూ 68 ఏళ్లు...?


తిక్క  లెక్క

వృత్తి, వ్యాపారాల్లో ఎంతటి వారైనా ఎన్నాళ్లు కొనసాగగలరు?.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకే చాలామందికి ఓపిక సన్నగిల్లి రిటైరైపోతారు. అవకాశాలు, అదృష్టం, ఆరోగ్యం వంటివన్నీ అనుకూలిస్తే అరుదుగా కొందరు కెరీర్‌లో స్వర్ణోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. విషయమేమిటంటే, ఇక్కడ ఈ రెండు ఫొటోల్లో కనిపిస్తున్న వ్యక్తి ఒకరే. పేరు అలన్ గాంజ్. ఐస్‌క్రీమ్ అమ్మకంలో గాంజ్‌గారిది ఏకంగా 68 ఏళ్ల ఇండస్ట్రీ. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

పదేళ్ల ప్రాయంలోనే 1947లో మసాచుసెట్స్ వీధుల్లో అద్దెకు తీసుకున్న బండి తిప్పుతూ ఐస్‌క్రీమ్ అమ్మడం మొదలుపెట్టాడు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పూర్తయ్యే కాలానికి... అంటే 1977లో సొంత దుకాణం పెట్టుకునే స్థితికి ఎదిగాడు. ఇప్పటికీ ఈ దుకాణాన్ని తానే స్వయంగా నిర్వహిస్తుండటంతో గిన్నెస్‌బుక్ గాంజ్ ఘనతను గుర్తించింది.    


Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment